స్వాతంత్ర్య అమృత మహోత్సవం భారతదేశం యొక్క 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను మొత్తం దేశంలో జరుపుకుంటుంది. దేశంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ ఇది జరుపబడుతుంది. ఇందులోని ప్రతి కార్యక్రమం స్వాతంత్ర్య అమృతోత్సవ లక్ష్యంతో నడుస్తుంది. కార్యక్రమాలలో ప్రజలు సాధ్యమైనంత ఎక్కువగా పాలు పంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. సంపూర్ణ ప్రభుత్వ విధానం (అన్ని మంత్రిత్వశాఖల మధ్య, రాష్ట్రాల మధ్య, యూనియన్ టెరిటరీల మధ్య సాఫీ అయిన సమన్వయం) అన్నమాట.
స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో భాగంగా ఈ కింద సూచించబడిన కార్యక్రమాలు జరిగినవి. ఈ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినాయి.
- మంత్రిత్వ శాఖలు ఇతర విభాగాలు: భారతదేశ కేంద్ర మంత్రిత్వ శాఖలు జరిపిన కార్యక్రమాలు
- రాష్ట్రాలు/యూనియన్ టెరిటరీలు: యూనియన్ టెరిటరీ స్థాయి మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు జరిపిన కార్యక్రమాలు
- దేశాలు: అంతర్జాతీయంగా జరిగిన కార్యక్రమాలు
- ప్రముఖ కార్యక్రమాలు: పెద్దస్థాయిలో జరిగిన స్వాతంత్ర్య అమృత మహోత్సవ కార్యక్రమాలను నిర్వచించడం
- అంశాల వారీ కార్యక్రమాలు: స్వాతంత్ర్య అమృత మహోత్సవ కార్యక్రమాల ఐదు రకాలు (స్వాతంత్ర్య పోరాటం, Ideas@75, Actions@75, Achievements@75, Resolve@75)