ఆత్మనిర్భర్ భారత్ | థీమ్స్ 2.0 | స్వాతంత్ర్య అమృత మహోత్సవం | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆత్మనిర్భర్ భారత్

Atmanirbhar Bharat

ఆత్మనిర్భర్ భారత్

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లేదా స్వావలంబన భారతదేశ ప్రచారం అనేది గౌరవప్రదమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఊహించిన నవ భారతదేశం. 12 మే 2020న, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వయం-ఆధారమైన భారతదేశం కోసం ప్రచారం) ను ప్రారంభిస్తూ ఆయన దేశానికి ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు. 20 లక్షల కోట్ల రూపోయల ప్రత్యేక ఆర్థిక మరియు సమగ్ర ప్యాకేజీని ప్రకటించారు. ఇది భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి (GDP) లో 10%కు సమానం. ఇది COVID-19 మహమ్మారిపై పోరాడటానికి ఉద్దేశింపబడింది.

దేశాన్ని, దాని పౌరులను స్వతంత్రంగా మరియు అన్ని భావాలలో స్వావలంబన కలిగి ఉండేలా చేయడమే లక్ష్యం. ఆయన ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఐదు ప్రధాన స్తంభాలను వివరించారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ,శక్తిపూరిత జనాభా పరిశోధన శాస్త్రం (వైబ్రెంట్ డెమోగ్రఫీ) మరియు డిమాండ్.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఏడు రంగాల్లో ప్రభుత్వ సంస్కరణలు చేయగల సంస్థలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ఆత్మనిర్భర్ లక్ష్యాల సాధన దిశగా వ్యవసాయం, హేతుబద్ధమైన పన్ను వ్యవస్థలు, సరళమైన మరియు స్పష్టమైన చట్టాలు, సమర్థమైన మానవ వనరులు మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ కోసం సరఫరా గొలుసు (సప్లై చైన్) సంస్కరణలు వంటి సంస్కరణలను చేపట్టింది.

భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడానికి సహాయపడే ప్రాంతాలు క్రింద పేర్కొనబడినాయి

  • ఆర్థిక వ్యవస్థ: క్వాంటం జంప్స్, పెరుగుతున్న మార్పులు కాదు
  • మౌలిక సదుపాయాలు: ఇవి ఆధునిక భారతదేశానికి అద్దం పడుతాయి.
  • వ్యవస్థ: సాంకేతికత చేత సామర్థ్యాన్ని పొందిన వ్యవస్థలు
  • శక్తిపూరిత జనాభా అధ్యయనం: ఇది అన్నిటికన్న పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి సంకేతం.
  • డిమాండ్: డిమాండ్ మరియు సరఫరా శక్తి యొక్క పూర్తి వినియోగం.

స్వావలంబన భారతదేశాన్ని ఎలా ఊహించుకోవాలి?

  • మౌలిక సదుపాయాలు: భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి మరియు మైలురాళ్లను జరుపుకోవడం అన్నది వృద్ధికి, ఆత్మనిర్భర్తకు ఎలా ఆజ్యం పోస్తోంది?
  • ఆత్మనిర్భరతకు ఆజ్యం పోయడంలో డిజిటల్ పరిజ్ఞనపు అందుబాటు: చెల్లింపు అప్లికేషన్లు, ఆహారాన్ని ఆర్డర్ చేయడం, కిరాణా షాపింగ్, టెలి మెడిసిన్, టెలి న్యాయం మొదలైనవి - డిజిటల్ యాక్సెస్ స్వయం విశ్వాసాన్ని ఎలా ప్రారంభిస్తుందనే దానిపై దృష్టి పెట్టండి.
  • యువకులు, వ్యాపార మెళకువలు, నవజాత వ్యాపారాలు: వ్యాపారం పట్ల ఆసక్తి కిగిన మనస్తత్వాలను పెంపొందించే కార్యక్రమాలు, సమన్వయ ఆధారిత అభ్యాసం మరియు మార్గదర్శక అవకాశాలు, ఆటల పోటీలు మరియు ఆటల మైదానాలు మొదలైనవి, ప్రపంచ వృద్ధి మరియు పురోగతికి దోహదపడే భారతదేశం నుండి వినూత్న నవజాత వ్యాపారాలు.
  • ప్రాంతాలలో సంస్కరణలు మరియు ఆత్మనిర్భరత: ప్రాంతాల పరంగా సంస్కరణలు,ప్రభావాన్ని బేరీజు వేయడం, మార్పు మరియు సంస్కరణల కోసం ప్రచారాలు, సులభంగా వ్యాపారం చేయడం మొదలైన వాటి ద్వారా విలువను బయలు పరచడం.
  • సామర్థ్యం గల మానవ వనరులు: మానవ వనరుల నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ. కొత్త కెరీర్లలో రకాలు మరియు ఎంపికలు.
  • బలమైన ఆర్థిక వ్యవస్థ: ఆన్లైన్ వ్యాపారం మొదలైన పద్ధతుల ద్వారా పిల్లలకు ఆర్థికశాస్త్రాన్ని బోధించడం, మహిళలు, గ్రామీణ లక్ష్య సమూహాలు మరియు ఇతరులకు డబ్బు ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించడం, సాంకేతికత మరియు సైబర్ సెక్యూరిటీ క్యాంపులు మరియు దూరప్రాంతాలకు చేరడం.
  • వస్తువులను స్థానికంగా తయారు చేయడం కోసం గొంతెత్తడం: తగ్గిన దిగుమతులు, పెరిగిన ఎగుమతులు, వస్తులను స్థానికంగా తయారు చేయడం కోసం గొంతెత్తడం (వోకల్ ఫర్ లోకల్), గ్రామీణ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే కిందిస్థాయి ప్రచారాలు ఆత్మవిశ్వాసం కోసం స్థానిక కార్యక్రమాలను హైలైట్ చేస్తాయి.
  • ఆత్మనిర్భరతకు ఇంధనం నింపే అభ్యాసాలను ప్రోత్సహించండి: వనరులు మరియు ఉత్పత్తి యొక్క మెరుగైన సామర్థ్యాలను సాధించడానికి రంగాలు, పరిశ్రమలు, సంస్థల మధ్య ఖాళీలను రూపుమాపే కార్యక్రమాలు మరియు కార్యక్రమాలను ప్రోత్సహించండి. తద్వారా వనరులను సరిగ్గా ఉపయోగించుకుని మంచి ఉత్పత్తిని సాధించేలా తోడ్పడండి.
  • భారతదేసం ఒక ప్రపంచ తయారీ సంస్థ: ఈ విషయంలో మన విజయాలను ప్రచారం చేయండి (ఉదాహరణకు ఇండియాలో తయారైన ఐఫోన్లు)
  • భారతదేశం ఒక ఆపన్న హస్తం: వసుధైవ కుటుంబకమ్ అనే సూత్రం ప్రకారం ప్రపంచం నా కుటుంబం అన్నది భావన. మన దేశం ఇతర దేశాలకు ఆపన్న హస్తాన్ని అందించడం గురించి ప్రచారం చేయండి.
read more

Top