థీమ్స్ | స్వాతంత్ర్య అమృత మహోత్సవం

థీమ్స్

స్వాతంత్ర్యోద్యమం

చరిత్రలోని ప్రధాన ఘట్టాలను స్మరించుకోవడం, విస్మృత ధీరోదాత్త నాయకులు మొదలైనవి.

ఈ అంశం స్వాతంత్ర్య అమృతోత్సవ కార్యాచరణ స్మరణను స్థిరపరుస్తుంది. అది విస్మృత ధీరోదాత్త నాయకుల వృత్తాంతాలను సజీవం చేసేందుకు ఉపయోగపడుతుంది. వారి త్యాగాలు మనకు స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేశాయి. ఈ అంశం 15 ఆగస్టు, 1947 తాలూకు చరిత్రాత్మక ప్రస్థానపు ప్రధాన ఘట్టాలు, స్వాంత్ర్యోద్యమాలుమొదలైనవాటిని జ్ఞప్తికి తెస్తుంది.

మరింత తెలుసుకోండి

Ideas@75

భారతదేశాన్ని రూపొందించిన ఊహలను, ఆదర్శాలను ఉత్సవంగా జరుపుకోవడం

ఈ అంశం మనను రూపొందించిన ఊహలమీద, ఆదర్శాలమీద, ఘట్టాలమీద దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. అమృత కాలం (భారతదేశం@75, భారతదేశం@100 ల మధ్య గల 25 సంవత్సరాల కాలం) లో పయనించేందుకు మార్గదర్శనం చేస్తుంది.

మరింత తెలుసుకోండి

Resolve@75

ప్రత్యేకమైన లక్ష్యాలను ఆశయాలను బలోపేతం చేసే బాధ్యతలు

ఈ అంశం మన మాతృభూమి యొక్క భాగ్యాన్ని రూపొందించేందుకు అవసరమైన గట్టి సామూహిక పట్టుదల, దృఢనిర్ణయం మీద దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. 2047 వరకు సాగబోయే మన ప్రస్థానం కోసం మనలోని ప్రతి ఒక్కరు నడుము బిగించి వ్యక్తులుగా, బృందాలుగా, మర్యాదపూర్వకమైన సమాజంగా, పరిపాలన సంస్థలుగా తమతమ పాత్రలను పోషించాలి.

మరింత తెలుసుకోండి

Actions@75

పాలసీ విధానాలను, బాధ్యతలను అమలుపరచేందుకు తీసుకునే చర్యలను ప్రస్ఫుటీకరించడం

ఈ అంశం నూతన ప్రపంచంలో భారతదేశం సరైన స్థానాన్ని సాధించేందుకు సహాయపడే అన్ని ప్రయత్నాల మీద దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. ముఖ్యంగా కొరోనా తర్వాతి ప్రపంచంలో మనం తీసుకోవలసిన విధానాల, బాధ్యతల గురించి.

మరింత తెలుసుకోండి

Achievements@75

వివిధ విభాగాలలోని వికాసక్రమాన్ని పురోగతిని చూపించడం

ఈ అంశం మన తోవలోని కాలగమనం మీద, మైలురాళ్ల మీద దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. ఇది మన సామూహిక సాధనలను కలిగిన ప్రజావృత్తాంతాన్ని రూపొందించేందుకు ఉద్దేశింపబడింది. డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య చరిత్రను, ఐదు వేల సంవత్సరాలకన్న ఎక్కువ వారసత్వాన్ని కలిగిన అతి ప్రాచీన దేశం మనది మరి.

మరింత తెలుసుకోండి

Top