भारत सरकारGOVERNMENT OF INDIA
संस्कृति मंत्रालयMINISTRY OF CULTURE
భారతదేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో చాలా మంది కవులు రచయితలు విప్లవాత్మక రచనలు చేశారు. అవి తమ అస్తిత్వానికి ప్రమాదకరంగా ఉన్నాయని భావించి, బ్రిటిష్ పాలకులు వాటిని నిషేధించారు. ఈ రచనలు ప్రజలలో దేశభక్తి భావాన్ని నెలకొల్పి స్వేచ్ఛాభారతం కోసం వారు ఉద్యమించేందుకు ఉద్దేశింపబడినాయి.
మన స్వాతంత్ర్య యోధుల భావనలను, ఆశయాలను ప్రతిబింబించే ఈ అసాధారణ రచనలు బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూలలో ఉన్నాయి.
నిషేధింపబడినప్పటికీ ప్రముఖుల చేత పాడబడిన కొన్ని రచనలను ఈ విభాగం సమర్పిస్తుంది.