సంస్కృతి గురించి గర్వపడటం | థీమ్స్ 2.0 | స్వాతంత్ర్య అమృత మహోత్సవం | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

సంస్కృతి గురించి గర్వపడటం

Cultural Pride

సంస్కృతి గురించి గర్వపడటం

భారతదేశం అనేక సంస్కృతుల భూమి. దీని నాగరికత ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. ఇది 4,000 సంవత్సరాల కంటే పూర్వంనుండి ఉంటూవస్తున్నది. ఈ సమయంలో దేశం యొక్క గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబించే అనేక ఆచారాలు మరియు సంప్రదాయాలు కలిసి వచ్చాయి.

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం మొదలుకుని కొన్ని రుచికరమైన వంటకాలకు ప్రథమావిష్కర్తగా ఉండటం వరకు, మన దేశప్రతిష్ఠకు హద్దులు లేవు. ఈ దేశంలోని ప్రజలు తమ సాంస్కృతిక స్వభావాల పట్ల గర్వంగా ఉంటారని మరియు వారి వారసత్వాలను నిరంతరం ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పడం సరైంది.

'కోస్-కోస్ పర్ బద్లే పానీ, చార్ కోస్ పర్ బనీ' అనే ప్రసిద్ధ హిందీ సూత్రం భారతదేశ భాషా వైవిధ్యాన్ని నిర్వచిస్తుంది. భారతదేశం వంటి బహుళ సంస్కృతుల భూమిలో, భాగస్వామ్య భాష మన సంస్కృతిలో ఏకీకరణ మరియు కీలకమైన భాగం. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించేటప్పుడు మనం అద్భుతమైన వారసత్వ కట్టడాలను అన్వేషించవచ్చు. ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయ వంటకాలు, మాండలికం మరియు వేషధారణలను గర్వంగా స్వీకరిస్తున్నారు.

  • భారతీయ సాహిత్యం యొక్క ప్రచారం (ముఖ్యంగా స్థానిక/ప్రాంతీయ కార్యాల యాలు): ప్రాంతీయ ప్రచురణ సంస్థలను గుర్తించడం, భారతీయ భాషల మూలాలు మరియు ఇతర దేశాల భాషలపై వాటి ప్రభావం గురించి అవగాహన; చారిత్రక గ్రంథాలయాలు మొదలైన వాటిపై అవగాహన
  • కళారూపాలు, జానపద సాహిత్యం, సంగీతం, నృత్యం: పాటలు, నృత్యం, నాటకరంగం, సంగీతం, జానపద సంప్రదాయాలు, చిత్రకళ మరియు రచనల యొక్క అతిపెద్ద సేకరణలలో ఒకదాన్ని 'మానవత్వం యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వం' అని పిలుస్తారు.
  • జాతీయ అస్తిత్వపు గుర్తింపు: దేశ చరిత్రలో, భారతదేశం లోపల, బయట రాజకీయ మరియు మతపరమైన సంస్థలు మారినందున "భారతీయ అస్తిత్వపు గుర్తింపు" మారింది. మన దేశం పురోగమిస్తోంది మరియు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో యువకులు చురుకుగా పాల్గొంటున్నారు.
  • దృశ్య మాధ్యమాల ద్వారా ప్రాంతీయ భాషలను సంరక్షించడం మరియు ప్రచారం చేయడం: చలన చిత్రోత్సవాలను ప్రభావవంతంగా ఉపయోగించడం; ఉదాహరణకు, చిన్న వేదికల మీద ప్రాంతీయ లేదా స్థానిక భాషా చిత్రాలను ప్రదర్శించే సంచార/అప్పటికప్పుడు చేసే ఉత్సవాలు; భాగస్వామ్య రాష్ట్రాల్లోని భాషలపై ప్రచారాలను నిర్వహించడానికి ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ను ఉపయోగించడం; బహుభాషా సంకేతాలు మొదలైన వాటిని గురించిన జ్ఞానం.
  • భాషలను నేర్చుకునే వివిధ రీతుల ప్రచారం: మాట్లాడటం, వినడం, రాయడం; యాప్ ఆధారిత అభ్యాసం గురించి అవగాహన (ఉదాహరణకు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క భాషా సంగం యాప్); సాంకేతికత మరియు భాషల మధ్య సంబంధం; వేగవంతమైన అభ్యాస కార్యకలాపాలు; భాషలు నేర్చుకోవడానికి ప్రాంతీయ వార్తాపత్రికలను ఉపయోగించడం మొదలైనవి.
  • భౌగోళికం మరియు అంతరిక్షం: భారతదేశం విభిన్న భౌగోళిక వాతావరణాన్ని కలిగి ఉంది, ఉత్తర భారతదేశం హిమాలయ పర్వతాల శ్రేణి మరియు గ్రేట్ ఇండియన్ ఎడారి (థార్) చేత రక్షించబడింది. మరోవైపు, ఉష్ణమండల అరణ్యాలు, వర్షారణ్యాలు, తీర మైదానాలు, ద్వీపాలు మరియు సముద్ర తీరాలు దక్షిణ భారతదేశాన్ని వేరు చేస్తాయి.
read more

Top