భారతదేశ పతాకం గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు
ప్రశ్న 1. జాతీయ జెండాను ఉపయోగించడం, ప్రదర్శించడం, ఎగురవేయడం చేసేందుకు ఏవైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా?
ఉన్నాయి. అవి భారతదేశ జెండా నియమావళి 2022, జాతీయ పతాక అవమానాల నిరోధక చట్టం 1971
ప్రశ్న 2. భారతదేశ పతాక నియమావళి ఏమిటి?
ఈ నియమావళి అన్ని చట్టాలను, ఒడంబడికలను, అభ్యాసాలను, ఆదేశాలను ఏకీకృతం చేయగా ఏర్పడింది. అది ప్రైవేటు, ప్రజా, మరియు ప్రభుత్వ సంస్థలు జాతీయ పతాకాన్ని ప్రదర్శించడాన్ని నియంత్రిస్తుంది. ఈ నియమావళి 26 జనవరి, 2022 నుండి అమలులో ఉంది.
ప్రశ్న 3. జాతీయ జెండాను తయారు చేసేందుకు ఏ పదార్థాన్ని ఉపయోగించవచ్చు?
భారతదేశ జెండా నియమావళి 2002 సవరింపబడింది (చూడుడు 30 డిసెంబర్, 2021 నాటి ఉత్తరువు). పాత నియమావళి ప్రకారం పాలియెస్టర్ గుడ్డతో చేసిన జెండాను గాని, మరమగ్గం మీద తయారైన జెండాను గాని ఉపయోగించవచ్చు. కొత్త నియమావళి ప్రకారం జెండాను నూలు/పాలియెస్టర్/ఉన్ని/పట్టు/ఖాదీ తో తయారు చేయవచ్చు. చేతిమగ్గం మీద గాని, మరమగ్గం మీద గాని తయారు చేసిన జెండాలను అనుమతిస్తారు.
ప్రశ్న 4. జాతీయ జెండా యొక్క పరిమాణం (సైజు), నిష్పత్తి ఎంత ఉండాలి?
నియమావళిలోని 1.3 మరియు 1.4 పారాగ్రాఫుల ప్రకారం జాతీయ పతాకం దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. జెండా ఏ పరిమాణంలోనైనా ఉండవచ్చును. కానీ దాని పొడవు, వెడల్పు, (ఎత్తు) ల మధ్య నిష్పత్తి 3:2 గా ఉండాలి.
ప్రశ్న 5. జాతీయ పతాకాన్ని నా ఇంటివద్ద ఎగరేయవచ్చా?
జెండా నియమావళిలోని పారాగ్రాఫు 2.2 ప్రకారం ఒక భారత పౌరుడు, లేదా ప్రైవేటు సంస్థ, లేదా విద్యాసంస్థ జాతీయ జెండాను ఎగరేయవచ్చు. అయితే ఆ కార్య విధానం పతాక గౌరవానికి అనుగుణంగా ఉండాలి.
ప్రశ్న 6. బయట, ఇంటిదగ్గర జెండాను ఏ సమయాలలో ఎగురవేయవచ్చు?
భారతదేశ జెండా నియమావళి 2002 సవరింపబడింది (20 జూలై 2022 నాటి ఉత్తరువును చూడుడు). భారతదేశ జెండా పాత నియమావళిలోని రెండవ భాగంలోని 2.2 పారాగ్రాఫ్ యొక్క 11 వ ప్రకరణాన్ని రద్దు చేసి ఈ కింది ప్రకరణాన్ని చొప్పించారు.
బయట గానీ, పౌరుని ఇంటిమీద గానీ జెండాను రాత్రిబవళ్లు ప్రదర్శింపవచ్చు.
ప్రశ్న 7. నా ఇంటివద్ద జాతీయ జెండాను ప్రదర్శించేటప్పుడు ఏ విషయాలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి?
జాతీయ జెండాను ప్రదర్శించినప్పుడు అది గౌరవప్రదంగా స్పష్టంగా కనిపించాలి. చిరిగిపోయిన, లేదా చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ప్రదర్శించకూడదు.
ప్రశ్న 8. జాతీయ పతాకాన్ని తప్పుగా ప్రదర్శించకుండా ఉండాలంటే ఏ విషయాలను జ్ఞాపకం పెట్టుకోవాలి?
- జెండాను తలకిందులుగా ప్రదర్శించకూడదు. అంటే కాషాయవర్ణపు భాగం అడుగున ఉండకూడదు.
- చిరిగిపోయిన, లేదా చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ప్రదర్శించకూడదు.
- ప్రజలు వందనం చేసేటప్పుడు జెండా తక్కువ ఎత్తులో ఉండకూడదు.
- ఏ ఇతర జెండాను గాని, గుడ్డను గాని జాతీయ జెండాకంటె ఎత్తున లేదా పక్కన ఉంచకూడదు. పువ్వులు, దండలు, చిహ్నాలు మొదలైన ఏ వస్తువునూ జెండాకర్ర మీద గాని, మరింత ఎత్తుప్రదేశంలో గాని పెట్టకూడదు.
- జాతీయ పతాకాన్ని ఒక తోరణంగా, లేక గుడ్డతో కుట్టిన పువ్వుగా, లేక గుడ్డముక్కగా ఉపయోగించకూడదు. మరే ఇతర అలంకరణగా కూడా వాడకూడదు.
- జాతీయ జెండా నేలను గాని, నీరును గాని తాకకూడదు.
- జెండాను చెడిపోయే విధంగా కట్టకూడదు, ప్రదర్శించకూడదు.
- జెండాను ఇతర జెండా(ల)తో కలిపి ఒకే కర్ర మీద ఎగురవేయ కూడదు.
- ఎవరైనా ఉపన్యాసమిస్తున్నప్పుడు ఉపన్యాసకుని ముందండే బల్లమీద దాన్ని కప్పకూడదు. వేదిక మీది నిలువు చెక్క డెస్కు మీద కూడా ఉంచకూడదు.
- ధరించే వస్త్రంగా, యూనిఫాంగా, వ్యక్తుల నడుము కిందిభాగంలో ధరించే వర్ణనాత్మక చిహ్నంగా ఉపయోగించకూడదు. దిండులమీద, చేతిరుమాళ్ల మీద, నాప్కిన్స్ మీద, లోదుస్తుల మీద, ఏ వస్త్రం మీద ప్రదర్శించకూడదు.
ప్రశ్న 9. జాతీయ జెండాకు అవమానం జరగకుండా ఉండేవిధంగా ఏవైనా నియమాలున్నాయా?
ఉన్నాయి. భారతదేశ జెండా నియమావళి 2022 జాతీయ అవమానాల నిరోధక చట్టం 1971 యొక్క రెండవ సెక్షన్ లోని 4 వ వివరణ ప్రకారం ఈ కింది నియమాలను పాటించాలి.
- ప్రైవేటు వ్యక్తుల శవాలు సహా ఇతర దేనినీ చుట్టేందుకు జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
- ధరించే వస్త్రంగా, యూనిఫాంగా, వ్యక్తుల నడుము కిందిభాగంలో ధరించే వర్ణనాత్మక చిహ్నంగా ఉపయోగించకూడదు. దిండులమీద, చేతిరుమాళ్ల మీద, నాప్కిన్స్ మీద, లోదుస్తుల మీద, ఏ వస్త్రం మీద ప్రదర్శించకూడదు.
- జెండా మీద ఏదీ రాయబడి ఉండకూడదు.
- వస్తువులను చుట్టేందుకు తీసుకునేందుకు, లేదా ఇచ్చేందుకు జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
- ఏ వాహనపు పక్కభాగాన్ని గానీ, వెనుకభాగాన్ని గానీ, పైభాగాన్ని గానీ కప్పేందుకు జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
ప్రశ్న 10. జాతీయ పతాకాన్ని బయట గానీ, ప్రజల ఇళ్లమీద గానీ ప్రదర్శించే సరైన పద్ధతి ఏది?
- జాతీయ జెండాను అడ్డంగా ఉన్న ఒక బల్లపరుపు గోడమీద ప్రదర్శించేటప్పుడు కాషాయవర్ణ భాగం మిగతా వర్ణాల భాగాలకన్న పైన ఉండాలి. నిలువుగా ప్రదర్శించేటప్పుడు కాషాయవర్ణ భాగం జెండా కుడివైపున ఉండాలి. అంటే దానికి ఎదురుగా ఉన్న వ్యక్తికి అది ఎడమ వైపున ఉండాలి.
- అడ్డంగా ఉన్న ఒక కర్రకు తగిలించి కిటికీ అడుగుభాగం నుండి, బాల్కనీ నుండి, లేదా భవనపు ముందుభాగం నుండి జాతీయ పతాకాన్ని ప్రదర్శించేటప్పుడు కాషాయవర్ణ భాగం కర్ర యొక్క అవతలి కొస దగ్గర ఉండాలి.
ప్రశ్న 11. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయవచ్చా?
ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినప్పుడు తప్ప జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయకూడదు. సగం అవనతం చేసినప్పుడు మొదట జెండాకర్ర యొక్క శీర్షభాగాన ఎగురవేసి, తర్వాత సగం అవనతం చేయాలి. కిందికి దించేముందు ఒకసారి కర్ర శీర్షభాగం దాకా తీసుకుపోవాలి.
ప్రశ్న 12. జాతీయ జెండాను నేను నా వాహనం మీద ప్రదర్శించవచ్చా?
భారతదేశ జెండా నియమావళి 2002 లోని 3.44 పారాగ్రాఫ్ ప్రకారం వాహనాల మీద జాతీయ జెండాను ప్రదర్శించే హక్కు ఈ కింద చెప్పబడిన వ్యక్తులకు మాత్రమే పరిమితమై ఉంది.
- భారతద రాష్ట్రపతి
- భారతద ఉపరాష్ట్రపతి
- గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు
- దౌత్యకార్యాలయాల అధిపతులు
- ప్రధానమంత్రి
- క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, భారత యూనియన్ రాష్ట్రాల డిప్యూటీ మంత్రులు
- రాష్ట్ర ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు, యూనియన్/టెరిటరీల మంత్రులు
- లోక్ సభ స్పీకర్లు, రాజ్యసభ డిప్యూటీ చెయిర్మన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, రాష్ట్రాల విధాన సమితుల చెయిర్మన్ లు, రాష్ట్రాల యూనియన్ టెరిటరీల విధానసభల స్పీకర్లు, రాష్ట్ర విధాన సమితుల డిప్యూటీ చెయిర్మన్ లు, రాష్ట్రాల యూనియన్ టెరిటరీల విధానసభల డిప్యూటీ స్పీకర్లు
- భారతదేశ ప్రధాన న్యాయమూర్తి
- సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
- హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి
- హైకోర్టుల న్యాయమూర్తులు
ప్రశ్న 13. ఇతర దేశాల జెండాలతో కలిపి మన జాతీయ పతాకాన్ని ఎలా ఎగురవేయవచ్చు?
- జాతీయ జెండా నియమావళిలోని 3.32 పారాగ్రాఫ్ ప్రకారం మన జాతీయ పతాకాన్ని ఇతర దేశాల పతాకాలతో కలిపి వరుసగా ప్రదర్శించినప్పుడు, మన జెండా పూర్తిగా కుడివైపున ఉండాలి. దానికి ఎడమ పక్కన ఇతర దేశాల జెండాలు వాటి ఆంగ్లనామాల అక్షర క్రమంలో ఉండాలి.
- ఆ జెండాలు ఒకవేళ వలయాకారంలో నిలుపడి ఎగరేయబడితే మన జాతీయీ జెండా మొదట, ఇతర దేశాలవి తర్వాత కుడినుండి ఎడమ క్రమంలో ఉండాలి.
- మన జెండాను ఇతర జెండాతో గుణకారపు గుర్తు ఆకారంలో ఏదైనా గోడమీద ప్రదర్శిస్తే, మన జాతీయ పతాకం కుడివైపున ఉండి, దాని కర్ర ఇతర దేశపు జెండా కర్రకు ముందున ఉండాలి.
- మన జాతీయ పతాకాన్ని ఇతర దేశాల పతాకాలతో కలిపి ప్రదర్శించినప్పుడు, అన్ని జెండాలు ఒకే పరిమాణం (సైజు) లో ఉండాలి.