ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా

ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా

ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా (హర్ ఘర్ తిరంగా) స్వాతంత్ర్య అమృత మహోత్సవంలోని ఒక భాగం స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటివాళ్లు త్రివర్ణ పతాకాన్ని తెచ్చి ఎగరేయడాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశింపబడింది. మన జెండాకు మనతో ఉన్న సంబంధం ఎప్పుడూ వ్యక్తిగత భావనగా కన్న మర్యాదపూర్వకమైనదిగా, సంస్థకు సంబంధించినదిగా ఉంటూ వచ్చింది. అందరూ కలిసి జెండాను ఇంటికి తేవడం వ్యక్తిగత సంబంధానికి సంకేతంగానే కాకుండా దేశనిర్మాణ బాధ్యతను ప్రస్ఫుటింప జేస్తుంది. ప్రజల హృదయాలలో దేశభక్తిని నింపడం, భారత జాతీయ పతాకం పట్ల స్పృహను పెంపొందించడం దీని వెనుక ఉన్న ముఖ్యోద్దేశం.

అతి ముఖ్యమైన ఈ సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకోవడం కోసం 13 ఆగస్టు 2022 నుండి 15 ఆగస్టు 2022

వరకు మీ మీ ఇళ్లలో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. అంతే కాకుండా https://harghartiranga.com అనే వెబ్ సైట్ మీద మీరు జెండాను గుచ్చవచ్చు. జెండాతో దిగిన ఒక సెల్ఫీని కూడా పోస్టు చేయవచ్చు.

భారతదేశ పతాకం గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

ప్రశ్న 1. జాతీయ జెండాను ఉపయోగించడం, ప్రదర్శించడం, ఎగురవేయడం చేసేందుకు ఏవైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా?

ఉన్నాయి. అవి భారతదేశ జెండా నియమావళి 2022, జాతీయ పతాక అవమానాల నిరోధక చట్టం 1971

ప్రశ్న 2. భారతదేశ పతాక నియమావళి ఏమిటి?

ఈ నియమావళి అన్ని చట్టాలను, ఒడంబడికలను, అభ్యాసాలను, ఆదేశాలను ఏకీకృతం చేయగా ఏర్పడింది. అది ప్రైవేటు, ప్రజా, మరియు ప్రభుత్వ సంస్థలు జాతీయ పతాకాన్ని ప్రదర్శించడాన్ని నియంత్రిస్తుంది. ఈ నియమావళి 26 జనవరి, 2022 నుండి అమలులో ఉంది.

ప్రశ్న 3. జాతీయ జెండాను తయారు చేసేందుకు ఏ పదార్థాన్ని ఉపయోగించవచ్చు?

భారతదేశ జెండా నియమావళి 2002 సవరింపబడింది (చూడుడు 30 డిసెంబర్, 2021 నాటి ఉత్తరువు). పాత నియమావళి ప్రకారం పాలియెస్టర్ గుడ్డతో చేసిన జెండాను గాని, మరమగ్గం మీద తయారైన జెండాను గాని ఉపయోగించవచ్చు. కొత్త నియమావళి ప్రకారం జెండాను నూలు/పాలియెస్టర్/ఉన్ని/పట్టు/ఖాదీ తో తయారు చేయవచ్చు. చేతిమగ్గం మీద గాని, మరమగ్గం మీద గాని తయారు చేసిన జెండాలను అనుమతిస్తారు.

ప్రశ్న 4. జాతీయ జెండా యొక్క పరిమాణం (సైజు), నిష్పత్తి ఎంత ఉండాలి?

నియమావళిలోని 1.3 మరియు 1.4 పారాగ్రాఫుల ప్రకారం జాతీయ పతాకం దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. జెండా ఏ పరిమాణంలోనైనా ఉండవచ్చును. కానీ దాని పొడవు, వెడల్పు, (ఎత్తు) ల మధ్య నిష్పత్తి 3:2 గా ఉండాలి.

ప్రశ్న 5. జాతీయ పతాకాన్ని నా ఇంటివద్ద ఎగరేయవచ్చా?

జెండా నియమావళిలోని పారాగ్రాఫు 2.2 ప్రకారం ఒక భారత పౌరుడు, లేదా ప్రైవేటు సంస్థ, లేదా విద్యాసంస్థ జాతీయ జెండాను ఎగరేయవచ్చు. అయితే ఆ కార్య విధానం పతాక గౌరవానికి అనుగుణంగా ఉండాలి.

ప్రశ్న 6. బయట, ఇంటిదగ్గర జెండాను ఏ సమయాలలో ఎగురవేయవచ్చు?

భారతదేశ జెండా నియమావళి 2002 సవరింపబడింది (20 జూలై 2022 నాటి ఉత్తరువును చూడుడు). భారతదేశ జెండా పాత నియమావళిలోని రెండవ భాగంలోని 2.2 పారాగ్రాఫ్ యొక్క 11 వ ప్రకరణాన్ని రద్దు చేసి ఈ కింది ప్రకరణాన్ని చొప్పించారు.

బయట గానీ, పౌరుని ఇంటిమీద గానీ జెండాను రాత్రిబవళ్లు ప్రదర్శింపవచ్చు.

ప్రశ్న 7. నా ఇంటివద్ద జాతీయ జెండాను ప్రదర్శించేటప్పుడు ఏ విషయాలను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి?

జాతీయ జెండాను ప్రదర్శించినప్పుడు అది గౌరవప్రదంగా స్పష్టంగా కనిపించాలి. చిరిగిపోయిన, లేదా చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ప్రదర్శించకూడదు.

ప్రశ్న 8. జాతీయ పతాకాన్ని తప్పుగా ప్రదర్శించకుండా ఉండాలంటే ఏ విషయాలను జ్ఞాపకం పెట్టుకోవాలి?

  • జెండాను తలకిందులుగా ప్రదర్శించకూడదు. అంటే కాషాయవర్ణపు భాగం అడుగున ఉండకూడదు.
  • చిరిగిపోయిన, లేదా చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ప్రదర్శించకూడదు.
  • ప్రజలు వందనం చేసేటప్పుడు జెండా తక్కువ ఎత్తులో ఉండకూడదు.
  • ఏ ఇతర జెండాను గాని, గుడ్డను గాని జాతీయ జెండాకంటె ఎత్తున లేదా పక్కన ఉంచకూడదు. పువ్వులు, దండలు, చిహ్నాలు మొదలైన ఏ వస్తువునూ జెండాకర్ర మీద గాని, మరింత ఎత్తుప్రదేశంలో గాని పెట్టకూడదు.
  • జాతీయ పతాకాన్ని ఒక తోరణంగా, లేక గుడ్డతో కుట్టిన పువ్వుగా, లేక గుడ్డముక్కగా ఉపయోగించకూడదు. మరే ఇతర అలంకరణగా కూడా వాడకూడదు.
  • జాతీయ జెండా నేలను గాని, నీరును గాని తాకకూడదు.
  • జెండాను చెడిపోయే విధంగా కట్టకూడదు, ప్రదర్శించకూడదు.
  • జెండాను ఇతర జెండా(ల)తో కలిపి ఒకే కర్ర మీద ఎగురవేయ కూడదు.
  • ఎవరైనా ఉపన్యాసమిస్తున్నప్పుడు ఉపన్యాసకుని ముందండే బల్లమీద దాన్ని కప్పకూడదు. వేదిక మీది నిలువు చెక్క డెస్కు మీద కూడా ఉంచకూడదు.
  • ధరించే వస్త్రంగా, యూనిఫాంగా, వ్యక్తుల నడుము కిందిభాగంలో ధరించే వర్ణనాత్మక చిహ్నంగా ఉపయోగించకూడదు. దిండులమీద, చేతిరుమాళ్ల మీద, నాప్కిన్స్ మీద, లోదుస్తుల మీద, ఏ వస్త్రం మీద ప్రదర్శించకూడదు.

ప్రశ్న 9. జాతీయ జెండాకు అవమానం జరగకుండా ఉండేవిధంగా ఏవైనా నియమాలున్నాయా?

ఉన్నాయి. భారతదేశ జెండా నియమావళి 2022 జాతీయ అవమానాల నిరోధక చట్టం 1971 యొక్క రెండవ సెక్షన్ లోని 4 వ వివరణ ప్రకారం ఈ కింది నియమాలను పాటించాలి.

  • ప్రైవేటు వ్యక్తుల శవాలు సహా ఇతర దేనినీ చుట్టేందుకు జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
  • ధరించే వస్త్రంగా, యూనిఫాంగా, వ్యక్తుల నడుము కిందిభాగంలో ధరించే వర్ణనాత్మక చిహ్నంగా ఉపయోగించకూడదు. దిండులమీద, చేతిరుమాళ్ల మీద, నాప్కిన్స్ మీద, లోదుస్తుల మీద, ఏ వస్త్రం మీద ప్రదర్శించకూడదు.
  • జెండా మీద ఏదీ రాయబడి ఉండకూడదు.
  • వస్తువులను చుట్టేందుకు తీసుకునేందుకు, లేదా ఇచ్చేందుకు జాతీయ జెండాను ఉపయోగించకూడదు.
  • ఏ వాహనపు పక్కభాగాన్ని గానీ, వెనుకభాగాన్ని గానీ, పైభాగాన్ని గానీ కప్పేందుకు జాతీయ జెండాను ఉపయోగించకూడదు.

ప్రశ్న 10. జాతీయ పతాకాన్ని బయట గానీ, ప్రజల ఇళ్లమీద గానీ ప్రదర్శించే సరైన పద్ధతి ఏది?

  • జాతీయ జెండాను అడ్డంగా ఉన్న ఒక బల్లపరుపు గోడమీద ప్రదర్శించేటప్పుడు కాషాయవర్ణ భాగం మిగతా వర్ణాల భాగాలకన్న పైన ఉండాలి. నిలువుగా ప్రదర్శించేటప్పుడు కాషాయవర్ణ భాగం జెండా కుడివైపున ఉండాలి. అంటే దానికి ఎదురుగా ఉన్న వ్యక్తికి అది ఎడమ వైపున ఉండాలి.
  • అడ్డంగా ఉన్న ఒక కర్రకు తగిలించి కిటికీ అడుగుభాగం నుండి, బాల్కనీ నుండి, లేదా భవనపు ముందుభాగం నుండి జాతీయ పతాకాన్ని ప్రదర్శించేటప్పుడు కాషాయవర్ణ భాగం కర్ర యొక్క అవతలి కొస దగ్గర ఉండాలి.

ప్రశ్న 11. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయవచ్చా?

ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినప్పుడు తప్ప జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయకూడదు. సగం అవనతం చేసినప్పుడు మొదట జెండాకర్ర యొక్క శీర్షభాగాన ఎగురవేసి, తర్వాత సగం అవనతం చేయాలి. కిందికి దించేముందు ఒకసారి కర్ర శీర్షభాగం దాకా తీసుకుపోవాలి.

ప్రశ్న 12. జాతీయ జెండాను నేను నా వాహనం మీద ప్రదర్శించవచ్చా?

భారతదేశ జెండా నియమావళి 2002 లోని 3.44 పారాగ్రాఫ్ ప్రకారం వాహనాల మీద జాతీయ జెండాను ప్రదర్శించే హక్కు ఈ కింద చెప్పబడిన వ్యక్తులకు మాత్రమే పరిమితమై ఉంది.

  • భారతద రాష్ట్రపతి
  • భారతద ఉపరాష్ట్రపతి
  • గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు
  • దౌత్యకార్యాలయాల అధిపతులు
  • ప్రధానమంత్రి
  • క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, భారత యూనియన్ రాష్ట్రాల డిప్యూటీ మంత్రులు
  • రాష్ట్ర ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు, యూనియన్/టెరిటరీల మంత్రులు
  • లోక్ సభ స్పీకర్లు, రాజ్యసభ డిప్యూటీ చెయిర్మన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్, రాష్ట్రాల విధాన సమితుల చెయిర్మన్ లు, రాష్ట్రాల యూనియన్ టెరిటరీల విధానసభల స్పీకర్లు, రాష్ట్ర విధాన సమితుల డిప్యూటీ చెయిర్మన్ లు, రాష్ట్రాల యూనియన్ టెరిటరీల విధానసభల డిప్యూటీ స్పీకర్లు
  • భారతదేశ ప్రధాన న్యాయమూర్తి
  • సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
  • హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి
  • హైకోర్టుల న్యాయమూర్తులు

ప్రశ్న 13. ఇతర దేశాల జెండాలతో కలిపి మన జాతీయ పతాకాన్ని ఎలా ఎగురవేయవచ్చు?

  • జాతీయ జెండా నియమావళిలోని 3.32 పారాగ్రాఫ్ ప్రకారం మన జాతీయ పతాకాన్ని ఇతర దేశాల పతాకాలతో కలిపి వరుసగా ప్రదర్శించినప్పుడు, మన జెండా పూర్తిగా కుడివైపున ఉండాలి. దానికి ఎడమ పక్కన ఇతర దేశాల జెండాలు వాటి ఆంగ్లనామాల అక్షర క్రమంలో ఉండాలి.
  • ఆ జెండాలు ఒకవేళ వలయాకారంలో నిలుపడి ఎగరేయబడితే మన జాతీయీ జెండా మొదట, ఇతర దేశాలవి తర్వాత కుడినుండి ఎడమ క్రమంలో ఉండాలి.
  • మన జెండాను ఇతర జెండాతో గుణకారపు గుర్తు ఆకారంలో ఏదైనా గోడమీద ప్రదర్శిస్తే, మన జాతీయ పతాకం కుడివైపున ఉండి, దాని కర్ర ఇతర దేశపు జెండా కర్రకు ముందున ఉండాలి.
  • మన జాతీయ పతాకాన్ని ఇతర దేశాల పతాకాలతో కలిపి ప్రదర్శించినప్పుడు, అన్ని జెండాలు ఒకే పరిమాణం (సైజు) లో ఉండాలి.

ప్రశ్న 14. జాతీయ పతాకాన్ని ఎలా పారవేయాలి?

  • భారతదేశ పతాక నియమావళిలోని 2.2 పారాగ్రాఫ్ ప్రకారం మన దేశ పతాకం ఒకవేళ చెడిపోతే, దాన్ని ఏకాంత ప్రదేశంలో మొత్తం ఒకేసారి క్షయింపజేయాలి. కాల్చడం ద్వారా లేదా జాతీయ పతాక గౌరవానికి తగిన విధానం ద్వారా ఈ పని చేయవచ్చు.
  • మన జాతీయ పతాకం ఒకవేళ కాగితంతో చేసినదైతే, ప్రజలు దాన్ని ఊపుతూ ప్రదర్శించవచ్చు. కానీ వీటిని నేలమీద వదిలివేయకూడదు. జాతీయ పతాక గౌరవానికి తగిన విధంగా ఏకాంత ప్రదేశంలో పడవేయాలి.

    ఆధారం:

    www.mha.gov.in/sites/default/files/flagcodeofindia_070214.pdf
    www.mha.gov.in/sites/default/files/Prevention_Insults_National_Honour_Act1971_1.pdf

జాతీయ పతాక నియమావళి 2002 లోని ప్రధాన అంశాలు

భారతదేశ జాతీయ పతాకం భారతీయుల ఆశలను, ఆశయాలను ప్రతిబింబిస్తుంది. అది మన దేశానికి గర్వకాణమైన చిహ్నం. దానిపట్ల సార్వజనీనమైన గౌరవం, సద్భక్తి ఉన్నాయి. భారతీయుల భావోద్వేగాలలో, మనోచేతనలో దానికి ఒక ప్రత్యేకమైన, అసాధారణమైన స్థానం ఉంది.

భారత జాతీయ పతాక ప్రదర్శన/వాడకం/ఎగురవేత భారతదేశ జెండా నియమావళి 2022 జాతీయ అవమానాల నిరోధక చట్టం 1971 మరియు జాతీయ పతాక నియమావళి 2002 చేత నియంత్రింపబడుతాయి. భారత జెండా నియమావళి 2002 లోని కొన్ని ప్రధాన అంశాలు సాధారణ ప్రజలకోసం కింద ఇవ్వబడినాయి.

  • భారతదేశ జెండా నియమావళి 2022 సవరింపబడింది (చూడుడు 30 డిసెంబర్ 2021 నాటి ఉత్తరువు). పాత నియమావళి ప్రకారం పాలియెస్టర్ గుడ్డతో చేసిన జెండాను గాని, మరమగ్గం మీద తయారైన జెండాను గాని ఉపయోగించవచ్చు. కొత్త నియమావళి ప్రకారం జెండాను నూలు/పాలియెస్టర్/ఉన్ని/పట్టు/ఖాదీ తో తయారు చేయవచ్చు. చేతిమగ్గం మీద గాని, మరమగ్గం మీద గాని తయారు చేసిన జెండాలను అనుమతిస్తారు.
  • భారతదేశపు ఒక పౌరుడు, ప్రైవేటు సంస్థ లేదా ఒక విద్యాసంస్థ జాతీయ పతాకాన్ని ప్రతిరోజు ప్రతి సందర్భంలో ఎగురవేయవచ్చు, ప్రదర్శించవచ్చు. అది ఉత్సవరూపంలో లేక ఇతరత్రా ఉండవచ్చు. అయితే ఆ చర్య జాతీయ పతాక గౌరవానికి అనుగుణంగా ఉండాలి.
  • భారతదేశ పతాక నియమావళి 2002 సవరింపబడింది (19 జూలై 2022 నాటి ఉత్తరువును చూడుడు). భారతదేశ పతాక నియమావళిలోని రెండవ భాగంలోని పారాగ్రాఫ్ 2.2 యొక్క 11 వ ప్రకరణాన్ని తొలగించి దాని స్థానంలో ఈ కింది నియమాన్ని పెట్టారు.
    (xi) జెండాను బయట గాని వ్యక్తి యొక్క ఇంటిలోన గాని ప్రదర్శించినప్పుడు, దాన్ని రాత్రింబవళ్లు ఎగురవేయవచ్చు.
  • జాతీయ పతాకం దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. దాని సైజు ఎంత ఉన్నా ఫరవా లేదు. కానీ పొడవుకూ ఎత్తు (వెడల్పు) కూ మధ్య నిష్పత్తి 3.2 గా ఉండాలి.
  • జాతీయ పతాకాన్ని ప్రదర్శించినప్పుడు అది గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి. స్పష్టంగా కనిపించేలా ఉండాలి.
  • ధ్వంసమైన (చెడిపోయిన), లేదా చిందరవందరగా ఉన్న జెండాను ప్రదర్శింప కూడదు.
  • జెండాను ఒకే కర్రమీద ఇతర జెండా(ల)తో కలిపి ఎగురవేయ కూడదు.
  • పతాక నియమావళిలోని మూడవ భాగం యొక్క తొమ్మిదవ సెక్షన్ లో చెప్పబడిన విధంగా భారత దేశాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి, గవర్నర్లు, మొదలైనవారు తప్ప ఇతరులు తమ వాహనాలమీద ఎగురవేయకూడదు.
  • ఏ ఇతర జెండాను గాని, గుడ్డను గాని జాతీయ జెండాకంటె ఎత్తున లేదా పక్కన ఉంచకూడదు.

గమనిక: ఇతర వివరాల కోసం జాతీయ పతాక అవమానాల నిరోధక చట్టం 1971 మరియు భారతదేశ పతాక నియమావళి 2002 రక్షణ మంత్రిత్వ వ్యవహారాల శాఖ వారి వెబ్ సైట్ లో ఉన్నాయి. www.mha.gov.in

ప్రతి ఇంట జెండా, కార్యరూపంలో!

ప్రతి ఇంటా జెండా కార్యక్రమం ప్రజల ఉద్యమంగా మారింది. అందులో భాగంగా ప్రతి వ్యక్తీ ఐక్యతతో అందరితో కలిసిపోతూ, జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నాడు. గ్రామాల నుండి నగరాల దాకా దేశం నలుమూలల నుండి ప్రజలు వచ్చి జెండాను ఎగురవేస్తూ ,మన దేశం కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర్య యోధులకు కృతజ్ఞతను తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం యువత మీద, పిల్లల మీద ప్రత్యేక ప్రభావాన్ని చూపింది.భారత స్వాతంత్ర్య సమరం తాలూకు జ్ఞాపకాలను భద్రపరచుకునేలా ప్రోత్సహించింది. అన్ని వేడుకల మధ్య భారత దేశం మరో మైలురాయిని చేరుకుంది. ఛత్తీస్ గఢ్ లోని క్రికెట్ స్టేడియంలో జెండాలను ఉపుతూ ఒక భారీ మానవ ఆకారాన్ని ప్రతిబింబింపజేయడం ద్వారా గిన్నెస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ కార్యక్రమం ద్వారా భారత దేశపు భిన్నత్వంలో ఏకత్వం యొక్క జీవాత్మ అధికం చేయబడింది.

దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో ‘ప్రతి ఇంటా జెండా’ కార్యక్రమం వేడుకల తాలూకు తళుకులు ఉన్నాయిక్కడ.

అండమాన్ నికోబార్ దీవులు

ఆంధ్రప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్

అస్సాం

బిహార్

చండీగఢ్

ఛత్తీస్ గఢ్

దాద్రా నాగర్ హవేలి మరియు డయ్యు డమన్

ఢిల్లీ

గోవా

గుజరాత్

హర్యానా

హిమాచల్ ప్రదేశ్

జమ్ము& కశ్మీర్

ఝార్ఖండ్

కర్ణాటక

కేరళ

లద్దాఖ్

లక్షద్వీప్

మధ్యప్రదేశ్

మహారాష్ట్ర

మణిపూర్

మేఘాలయ

మిజోరం

నాగాలాండ్

Top