సమగ్ర అభివృద్ధి | థీమ్స్ 2.0 | స్వాతంత్ర్య అమృత మహోత్సవం | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

సమగ్ర అభివృద్ధి

Inclusive Development

సమగ్ర అభివృద్ధి

సమగ్ర అభివృద్ధి అనేది సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ న్యాయమైన అవకాశాలను ప్రోత్సహిస్తుంది, సమాజంలోని ప్రతి సమూహానికి ప్రయోజనాలు లభిస్తాయి.

నీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, విద్యుత్తు మొదలైన అవసరమైన సేవల అందుబాటు, అలాగే నిరుపేద జనాభా కోసం లక్ష్యంగా పెట్టుకున్న ప్రయత్నాలు మరింత సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించడంలో పెద్ద పాత్రను వహిస్తాయి.

సమగ్ర అభివృద్ధి కోసం గుర్తింపబడిన ప్రజాసమూహాలు

  • గిరిజన మరియు గ్రామీణ సంఘాలు: గిరిజన జీవనశైలి యొక్క సామాజిక-సాంస్కృతిక అంశాల గురించి అవగాహన; సమాజంలో సంఘాల సమీకరణ; అట్టడుగు స్థాయిలో గిరిజనులను విద్యావంతులు చేయడం; స్వచ్ఛమైన నీరు, ఆహారం, పారిశుద్ధ్యం, విద్యుత్తు, నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటి ప్రాథమిక అవసరాలను పొందడం; సరైన రోడ్ల ద్వారా కనెక్టివిటీ; పక్కా ఇళ్లు; స్వయం సమృద్ధి సాధించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గ్రామీణ సంఘాలకు మద్దతు ఇవ్వడం; కొత్త ప్రాథమిక సాంకేతికతలకు పరిచయం మొదలైనవి.
  • శారీరక వికలాంగులు: వీల్ చెయిర్లు మరియు ఆడియో విజువల్ పరికరాల వంటి సౌకర్యాలను అందించడం; సులభమైన లభ్యత కోసం ర్యాంపులు మరియు వ్యూహాత్మక మార్గాల నిర్మాణం; సమాజంలో వికలాంగులను చేర్చడం గురించిన అవగాహన; విభిన్న ప్రతిభ కలిగినవారితో పరస్పర వ్యవహారం చేయడంపై వ్యక్తులకు మరియు నిపుణులకు శిక్షణ; నైపుణ్యం, ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారు, సంకేత భాష శిక్షణ మొదలైనవి.
  • బ్యాంకులు లేని రంగం: గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యం, ఆర్థిక అక్షరాస్యత, మొబైల్ బ్యాంకింగ్ పట్ల అవగాహన మొదలైన వాటి గురించిన అవగాహన.
  • మహిళలు: గర్భధారణకు ముందు మరియు తర్వాత రక్షణ, ఆరోగ్య రక్షణ, విద్య, పిల్లల సంరక్షణ, నైపుణ్యం-అభివృద్ధి, ఆర్థిక మెరుగుదలకు అవకాశాలు మొదలైనవి.
  • ఇతరములు: తమతో కలుపుకుపోతూ ప్రచారం ద్వారా ప్రయోజనం పొందగలిగే ఇతర సంఘాలు

అభివృద్ధికి అవకాశమున్న రంగాలు:

  • ఆర్థిక మెరుగుదల మరియు నైపుణ్యాభివృద్ధి: అట్టడుగు వర్గ సభ్యులకు అవకాశాలను పెంచడం, నైపుణ్యాభివృద్ధి (ఉదా: స్థానిక మరియు ప్రాంతీయ కళారూపాలు, వ్యవసాయం, పాడిపరిశ్రమ), కొత్త వ్యాపారాలు మరియు స్వయం సహాయక సమూహాలపై అవగాహన పెంచడం, ఆర్థిక సేవలు సులభంగా లభింపజేయడం, బ్యాంకులు, ఆర్థిక అక్షరాస్యత మరియు విద్య మొదలైనవి.
  • విద్య: మారుమూల గిరిజన ప్రాంతాలలో శిబిరాలు ఏర్పాటు చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో పుస్తకాలు మరియు రాతకు సంబందించిన వస్తువుల (స్టేషనరీల) పంపిణీ, ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలో చర్చా కార్యక్రమాలు మరియు కార్యశాలలు నిర్వహించడం, గిరిజన ప్రాంతాలను సందర్శించేలా ఉపాధ్యాయులు మరియు నిపుణులకు శిక్షణ ఇవ్వడం మరియు మాతృభాషలో బోధించడం మొదలైనవి.
  • ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుధ్యం: ఆరోగ్య రక్షణ సేవలలో పెరుగుదల, వ్యక్తిగత పరిశుభ్రత గురించిన అవగాహన, ప్రథమ చికిత్స, బహిష్టు సమయంలో రక్షణ, పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యం, టీకాలు వేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించిన అవగాహన, మురుగునీటిని సరైన పద్ధతిలో పారవేయడం మొదలైనవి.
  • పిల్లల రక్షణ: నేర్చుకోవడానికి సమాన అవకాశాలు, సామాజిక నైపుణ్యాలను అభ్యసించే అవకాశాలు, పరస్పర సంభాషణ కారక్రమాలు/శిబిరాలు, శారీరకంగా వికలాంగులైన పిల్లలకు ప్రత్యేక పాఠశాల విద్య, సమానత్వం మరియు వైవిధ్యం గురించిన అవగాహన, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు మొదలైనవి.
  • గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి: గృహాలు, రోడ్లు, విద్యుదీకరణ, నీటి సరఫరా, వ్యర్థ నీటి నిర్వహణ మొదలైనవి.
  • చట్టపరమైన హక్కులు మరియు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన: సమాన వేతనం, పని షిఫ్ట్‌లు, కార్యాలయంలో ప్రవర్తన, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు; అంత్యోదయ అన్న యోజన (AAY), ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP), ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY), దీనదయాల్ అంత్యోదయ యోజన- జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY-NULM), ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మొదలైనవి.
  • వ్యాపార మెళకువలు: అందుబాటులో ఉన్న వనరుల గురించిన అవగాహనను పెంచడం, ఆర్థిక స్వాతంత్ర్యం గురించిన అవగాహన, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పొందేందుకు సురక్షితమైన అవకాశాలు మొదలైన వాటిపై అవగాహన పెంచడం ద్వారా వ్యాపార మెళకువలను ప్రోత్సహించడం.
  • ఇతరములు: ఇతర ప్రాంతాలు మరియు రంగాలు
read more

Top