ముగ్గుల పోటీలు
వివిధ రాష్ట్రాలలో ముగ్గులు వివిధ పేర్లతో వివిధ అంశాలమీద వేయబడతాయి. తమిళనాడు లోని కొల్లాం, గుజరాత్ లోని సథియా, బెంగాల్ లోని అల్పన, రాజస్థాన్ లోని మందన, ఒడిశాలోని ఒసా, ఉత్తరాఖండ్ లోని ఐపన్, మహారాష్ట్ర లోని రంగోలి... ఇలా ప్రతి ప్రాంతంలో తమతమ ప్రత్యేకమైన సంప్రదాయాలను, జానపద గాథలను, ఆచారాలను ప్రతిబింబిస్తూ ప్రజలు ముగ్గులు వేస్తారు. కాబట్టి, ఇప్పుడు మీరు ముగ్గుల పోటీలో పాల్గొని మీ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. పది సంవత్సరాలకన్న ఎక్కువ వయసున్న అందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చు.