ఆరోగ్యం మరియు స్వస్థత | థీమ్స్ 2.0 | స్వాతంత్ర్య అమృత మహోత్సవం | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆరోగ్యం మరియు స్వస్థత

Health and Wellness

ఆరోగ్యం మరియు స్వస్థత

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆసుపత్రులు, వైద్య పరికరాలు, క్లినికల్ ట్రయల్స్, అవుట్‌సోర్సింగ్, టెలిమెడిసిన్, మెడికల్ టూరిజం, ఆరోగ్య బీమా మరియు వైద్య పరికరాలు ఉన్నాయి. అనారోగ్య నివారణ మరియు నివారణ చర్యల నిఘా నుండి ఆరోగ్యం తరచుగా స్పష్టం (డీకోడ్) చేయబడుతుంది.

ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతివైద్యంలో సుస్థిరం చేయబడిన పురాతన వైద్య విధానాల గురించి మనకున్న లోతైన జ్ఞానం ఆధారంగా ఆరోగ్యానికి చరిత్రాత్మకంగా సంప్రదాయక విధానాలు. యునాని, సిద్ధ మరియు హోమియోపతి కూడా భారతదేశంలో ఆరోగ్యం మరియు సంరక్షణ కథనంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ రంగాలు:

  • ఆయుష్: భారతీయ విజ్ఞాన వ్యవస్థలలో స్థిరత్వం గల సంప్రదాయ ఔషధాల పరిజ్ఞానాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించిన ఆయుష్ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది.
  • యోగాతో స్వస్థత మరియు దేహదారుఢ్యం: యోగా పరమైన సమగ్ర స్వస్థత కోసం ప్రపంచం ఎల్లప్పుడూ భారతదేశం వైపు చూస్తోంది. పెరుగుతున్న నిశ్చల జీవనశైలి ఆధారిత జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను స్థిరమైన భాగంగా మార్చడం మన తదుపరి లక్ష్యం.
  • మెరుగైన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం: ఆయుర్వేదం యొక్క ముఖ్యమైన పాత్ర మరియు పనితీరు, పంచభూతాల కథనాలు మొదలైనవాటిని బయటకు తీసుకురావడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.
  • మానసిక ఆరోగ్యం మరియు ఒత్తిడి నిర్వహణ: అవగాహన గురించిన ప్రచార కార్యక్రమాలు, కార్పొరేట్ కార్యకరమాలు, మందులు మరియు యోగా ఆధారిత కార్యక్రమాలు, పరీక్షల సమయంలో ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి, పోలీసు బలగాలు మరియు ఇతరుల సుదీర్ఘ డ్యూటీ గంటలు మొదలైనవి.
  • యోగ్యమైన ఇండియా దిశగా: మహిళలు, పిల్లలు, వయోవృద్ధులు, పట్టణ శ్రామిక పురుషులు మొదలైన నిర్దిష్ట విభాగాలను లక్ష్యంగా చేసుకుని ఫలితాల ఆధారిత కార్యక్రమాలు.
  • తల్లుల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ: కొత్త మరియు ఆవిష్కార పద్ధతులపై దృష్టి సారించే ప్రత్యేక శిబిరాలు మరియు సెమినార్లు.
  • పోషకాహారం, విద్య: మధ్యాహ్న భోజనంలో తదుపరి వాటిపై దృష్టి పెట్టండి - బలవర్ధకం, పోషణ ప్రాంగణాలు, స్మార్ట్ ట్రాకర్లు మొదలైనవి.
  • ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుధ్యం: ఆరోగ్య సంరక్షణ సేవలలో పెరుగుదల, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన, ప్రథమ చికిత్స, బహిష్టు సమయంలో రక్షణ, పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యం, టీకా, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించిన అవగాహన
  • ఆరోగ్య రక్షణలో నవజాత పరిశ్రమలు: ఆరోగ్య రక్షణలో నవజాత పరిశ్రమలు మరియు వాటి ద్వారా పరిష్కరించబడుతున్న ప్రభావవంతమైన ఆరోగ్య సంబంధిత సమస్యలు.
  • క్రీడా సమయాలు, ఆటలు: మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో రోజువారీ ఆటలు, ఆట సమయాలు, వాటిని గురించిన కార్యక్రమాలు.
  • మెడికల్ టూరిజం: వైద్య పర్యాటకత్వం పెరుగుతున్న ధోరణిపై దృష్టి సారించే బోధన కార్యక్రమాలుప – ధోరణులులు, అవకాశాలు మరియు సవాళ్లు. ఆరోగ్య సంరక్షణలో భారతీయ ఆవిష్కరణలు, వ్యయ సామర్థ్యాలను వెలికితీసే ప్రత్యేక ప్రచారాలు.
  • బాల్యంలో ఊబకాయం: చిరుతిళ్ల వంటి పోషకరహిత ఆహారాన్ని తీసుకోవడం గురించి పట్టణాలలో ప్రచారాలు, సరైన రకానికి చెందిన ఆహారం తీసుకోవడం గురించిన అవగాహన శిబిరాలు మొదలైనవి.
  • టీకా కార్యక్రమాలు: పెద్ద ఎత్తున టీకా కార్యక్రమాలు, ఉత్తమ అభ్యాసాలు, కోవిడ్ అనుభవం నుండి పాఠాలు, ఇతర దేశాలతో జ్ఞానాన్ని పంచుకోవడం.
  • నవభారతం – ప్రపంచ ఔషధ కేంద్రం: మన దేశం పరిమాణం ప్రకారం ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఔషధ పరిశ్రమ. భారతీయ ఔషధ కంపెనీలు తమ ధరల పోటీతత్వంతో మరియు మంచి నాణ్యతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించాయి. ప్రపంచంలోని 60% టీకాలు మరియు 20% జెనరిక్ ఔషధాలు భారతదేశంలో తయారు చేయబడుతున్నాయి.
  • ఆరోగ్య సాంకేతికత మరియు టెలిమెడిసిన్
read more

Top