పరిశుభ్ర గంగానది కోసం జాతీయ లక్ష్యం (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నివేదిక) ప్రకారం, భారతదేశం ప్రతి సంవత్సరం 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షాన్ని పొందుతుంది; ఏది ఏమైనప్పటికీ, వర్షాన్ని సంగ్రహించే విషయంలో భారతదేశం ప్రపంచంలో చాలా కింది స్థానంలో ఉంది. దాని వార్షిక వర్షపాతంలో కేవలం 8% మాత్రమే సంగ్రహిస్తుంది. అందుకే భూగర్భ జలాలను పెంచడానికి ప్రాముఖ్యం ఉంది. ఇలాంటి అంశాలను గురించిన అవగాహన పెంచుకోవడం నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
- పురాతన భూగర్భ జలాలను అధికం చేసే పద్ధతులు: కుండ్స్, ఝలారస్, బావ్రిస్, జోహాడ్స్ మొదలైన పురాతన భూగర్భ జలాల సాగు పద్ధతులు, పురాతన నీటి పారుదల వ్యవస్థలు మొదలైన వాటిపై అవగాహన.
- భూగర్భ జలాల పరిరక్షణ: నీటి వృథాను తగ్గించడం, ఉపయోగించిన నీటిని తిరిగి ఉపయోగించడం, భూగర్భ జలాలను తిరిగి నింపడం, మురుగునీటిని మళ్లీ ఉపయోగించేలా చేయడం గురించిన అక్షరాస్యత; చెరువు నీటిని ఉపయోగించి కరువు సంవత్సరాలలో పంటలను కాపాడే మార్గాల గురించిన జ్ఞానం; నీటి పంచాయతీ వంటి అనధికారిక నీటి కమిటీలను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు; అనుభవపూర్వక అభ్యాస పద్ధతులు మరియు ఆటల ద్వారా నీటి సంరక్షణను నేర్చుకోవడం; ఖాళీ స్థలాల్లో చెరువు నిర్మాణ ప్రయోజనం గురించి అవగాహన మరియు కమ్యూనిటీ చెరువు పరిరక్షణ అవసరం; గ్రామీణ వర్షాధార కేంద్రాలు, వర్షపు నీరును ఒడిసిపట్టేందుకు నిర్మాణాలు (ఫిష్-కమ్-వరి), రైతుల మధ్య భూగర్భ జలాలను పంచుకోవడం, సాగు కోసం నిటారుగా ఉన్న వాలులలో నీరును నిలువ చేయడం, వాటర్‌షెడ్ నిర్వహణ పద్ధతులు వంటి పరిరక్షణ పద్ధతులపై అవగాహన.
- పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత: సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య లేమి వలన కలిగే ప్రతికూల ప్రభావాలు (నీటితో సంక్రమించే వ్యాధులు), నీటి నాణ్యత మరియు పరిశుభ్రత మధ్య సంబంధం గురించిన జ్ఞానం, నీరు అడ్డుపడటం మరియు నీటి నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుంది మొదలైనవి.
Status and importance of traditional water conservation system in present scenario, Central Soil and Materials Research Station, New Delhi, National Mission for Clean Ganga (NMCG) (2019)
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2022, ఏప్రిల్, 24 న నీటి సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘అమృత్ సరోవర్’ పై మిషన్‌ను ప్రారంభించారు. దేశంలోని ప్రతి జిల్లాలో 75 నీటి వనరులను మెరుగుపరచడం మరియు పునరుద్ధరించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం.
- అమృత్ సరోవర్ యొక్క ఉపయోగాలు: జిల్లాలో స్థానిక నీటి వనరులను నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి ప్రవాహాన్ని నియంత్రించడం గురించిన అవగాహన, సరస్సుల దగ్గర ఆవాసాల గురించిన అవగాహన,నీరు మరియు పాక్షికమైననీటి మొక్కలు, జంతువుల గురించిన అవగాహన, వరదలు మరియు కరువు ప్రభావాల గురించిన అవగాహన, భూగర్భ జలాలను తిరిగి నింపే మార్గాలు మొదలైనవి.
- అమృత్ సరోవర్ ఫలితంగా సాధ్యమయ్యే కార్యక్రమాలు: జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ఇతర నీటి వనరుల పునరుద్ధరణ, పర్యావరణ మరియు జల ప్రాణుల పునరుద్ధరణ, నీటి ఆధారిత జీవనోపాధిని మెరుగుపరచడం, మెరుగైన పరిరక్షణ మరియు నీటి వనరుల పరిశుభ్రత మొదలైనవి.