మహిళలు మరియు పిల్లలు
ఏ దేశం కోసమైనా మంచి భవిష్యత్తును నిర్మించేందుకు పిల్లల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం కీలకం. పిల్లల విలువలు, విద్య మరియు ఆరోగ్యం నేరుగా దేశాల సామాజిక, ఆర్థిక సూచికలను ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా దాని ప్రపంచ స్థితిని కూడా రూపొందిస్తాయి. అందువల్ల, పిల్లలు పౌర, సామాజిక మరియు నైతిక విద్యను పొందడం చాలా ముఖ్యం. ఆరోగ్య రక్షణ సేవలు మరియు శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక, కళలు, విద్య మొదలైన రంగాలలో అవి తాజా పరిణామాలకు దారి తీస్తాయి. భారతదేశంలో పిల్లల రక్షణలో గణనీయమైన మెరుగుదల ఉన్నప్పటికీ, ఆరోగ్య సేవలు, పారిశుధ్యం, విద్య, ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన వర్గాల పిల్లల కోసం అనేక రంగాలలో చేయవలసిన పని ఇంకా మిగిలే ఉంది.
అదేవిధంగా, కుటుంబం లోపల మరియు బయట ఉన్న స్త్రీలు ఏ దేశ అభివృద్ధినైనా లేక పురోగతినైనా కొలవడానికి కీలకమైన కొలమానాలు. భారతదేశ సందర్భంలో ఆడపిల్లల విద్య మరియు ఆరోగ్యం వంటి అనేక అంశాలలో కనిపించే పురోగతి వలన మహిళా ఉద్యమం చాలా ముందుకు వచ్చింది. ఈ పురోగతి కష్టపడి సాధించబడటమే కాక కేంద్ర మరియు స్థానిక ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు, పథకాలు, NGO లు, స్వచ్ఛంద సంస్థలు మరియు ముఖ్యంగా, వారి స్థిరమైన కృషి ద్వారా భారతదేశ స్వరూపాన్ని మార్చాయి. వ్యక్తిగత మహిళలు సహా ఈ సమస్యపై అన్ని రంగాల్లో జరిగిన ప్రయత్నాలు, ధైర్యం అందుకు తోడ్పడినాయి.
పిల్లల అభివృద్ధి
భారతదేశంలో పిల్లల అభివృద్ధిని మెరుగుపరచడానికి శ్రద్ధ అవసరమయ్యే రంగాలు క్రింద పేర్కొనబడ్డాయి:
పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత:
- పిల్లలలో ముఖ్యంగా దూర ప్రాంతాలలో నివసించేవారిలో పోషకాహార లోపం గురించి అవగాహన, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మొదలైనవి.
- ప్రసూతి ఆరోగ్యం మరియు పునరుత్పత్తి అవయవాల సంరక్షణ, అవగాహన; తల్లులకు ఇంటి కౌన్సెలింగ్; బహిష్టు సమయంలో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం; గ్రామీణ పాఠశాలల్లో పరిశుభ్రత కిట్లు మొదలైనవి.
- క్షయ, మలేరియా, న్యుమోనియా మరియు హెపటైటిస్ వంటి అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల గురించి అవగాహన; గ్రామీణ ప్రాంతాల్లో రోగనిరోధకత; పారిశుధ్యం మరియు పరిశుభ్రత కోసం ప్రయత్నాలు మొదలైనవి.
- కౌమారదశలో భావోద్వేగ స్థితిస్థాపకతను గుర్తించడం మొదలైనవి.
- మానసిక క్షేమం గురించిన అవగాహన, మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం కోరడం, సామాజిక కళంకం నుండి బయటపడటం.
విద్య
ప్రాథమిక విద్య అందుబాటులో ఉండటం; గ్రామీణ పాఠశాలల్లో నాణ్యమైన పాఠ్యపుస్తకాల మరియు స్టేషనరీ యొక్క లభ్యత; గ్రామీణ బాలికలలో ఇంటి పనిని కొనసాగించాలనే ఒత్తిడి గురించి అవగాహన; నాయకత్వ నైపుణ్యాలు; పాఠశాలల్లో పిల్లలు చదువు మానకుండా నిలుపుదల; వృత్తి విద్యా పఠనాన్ని మెరుగుపరచడం మరియు ప్రాథమిక అంకగణిత నైపుణ్యాలను అందించడం; ఉద్యోగ ఆధారిత నైపుణ్యంలో శిక్షణ; ఇ-బుక్స్ మరియు కంప్యూటర్లు మొదలైన సాంకేతికంగా అభివృద్ధి చెందిన పాఠశాల సామగ్రి.
- బాల్య వికాసం: తల్లిగర్భంలో ఉన్నప్పటి నుండి పాఠశాలకు వెళ్లే వయస్సు వరకు పోషకాహార అవసరాల గురించి అవగాహన, ఆట-ఆధారిత అభ్యాసం గురించిన అవగాహన, పరీక్ష ఒత్తిడి మరియు సంసిద్ధతతో వ్యవహరించడం, వారి కార్యకలాపాలు మరియు షెడ్యూల్ గురించి పిల్లలతో రోజువారీ పరస్పర చర్య, ఇంటరాక్టివ్ హోలిస్టిక్ కార్యకలాపాలలో పాల్గొనడం మొదలైనవి.
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు: డెస్క్‌లు, ఇంటినుండి పాఠశాలకు మరియు పాఠశాల నుండి ఇంటికి రవాణా, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, మధ్యాహ్న భోజనం, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఆట స్థలాలు వంటి అవసరమైన సదుపాయాల లభ్యత; స్థిరమైన మౌలిక సదుపాయాలు, హరిత పాఠశాలలను నిర్మించడం మొదలైనవి.
- ఆన్‌లైన్ అభ్యాసం: డిజిటల్ అక్షరాస్యతకు ప్రాచుర్యాన్ని కలిగించడం, విస్తృత సబ్జెక్ట్ ఎంపికలను అందించడం, దూర విద్య, సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడం, సమయ నిర్వహణను ప్రోత్సహించడం మొదలైనవి.
- ఉపాధ్యాయులకు బోధన: గ్రామీణ ప్రాంతాల్లో, టైర్ - 2 మరియు టైర్ - 3 నగరాల్లో ఉపాధ్యాయ శిక్షణ గురించి అవగాహన; సాంకేతికత వినియోగాన్ని అర్థం చేసుకోవడం; వృత్తిపరమైన అవగాహన, అభివృద్ధి మొదలైనవి
- క్రీడలు: శారీరక, మానసిక ఎదుగుదల మరియు అభివృద్ధి గురించిన అవగాహన, క్రీడలలో వృత్తిని కొనసాగించేందుకు విద్యార్థులకు ప్రోత్సాహం, క్రీడా మౌలిక సదుపాయాలు, వర్ధమాన ప్రతిభకు మద్దతు ఇవ్వడం, శారీరక విద్యా బోధకులకు శిక్షణ ఇవ్వడం, పిల్లల సర్వతోముఖాభివృద్ధిని ప్రోత్సహించడం మొదలైనవి.
- పాఠ్యేతర కార్యకలాపా: పిల్లలలో ఇతర నైపుణ్యాలను పెంపొందించడం; మాట్లాడటం, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక, ఇంటరాక్టివ్ సమయ నిర్వహణ, జట్టు స్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీ మొదలైనవి.
- డిజిటల్ డిటాక్స్: సామాజిక మాధ్యమాల వేదికలను ఎక్కువగా ఉపయోగించడం మరియు ఎక్కువ సేపు టీవీ, ఫోన్ ను చూసే సమయం గురించి అవగాహన, నిద్ర చక్రం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన మొదలైనవి.
- భయపెట్టడాన్ని, బెదిరించడాన్ని నివారించడం: బడిలోని చిన్న తరగతులలో పిల్లలను భయపెట్టడానికి వ్యతిరేకంగా కమిటీలను నియమించడం, పిల్లలకు సలహాలు ఇవ్వడం, పాఠశాల/కళాశాల లోని వాతావరణాన్ని ఆనందించేలా చేయడం, మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి.
- జీవితపు అభివృద్ధిదశ గురించిన సలహా ఇవ్వ: వివిధ కోర్సులను గురించిన అవగాహన, మంచి ఉద్యోగావకాశాలను గుర్తించడం, నైపుణ్య ఆధారిత శిక్షణ, పరిశ్రమలను గురించిన లోచూపులను ఆవిష్కరించడం, ఉపకార వేతనాలను గురించిన అవగాహన,అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను శోధించడం, జీవితపు అభివృద్ధి దశ గురించిన అవగాహనను బేరీజు వేయడం, వృత్తిపరమైన శిక్షణలు మొదలైనవి.
- సంభాషణ భాష: ప్రాంతీయ భాషలను నేర్చుకోవడం, సంభాషణ నైపుణ్యాన్ని మెరుగు పరచడం, మానసిక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం గురించిన అవగాహన, డౌన్స్ సిండ్రోమ్ (మంగోలిజమ్) అనే బుద్ధిమాంద్య వ్యాధి గురించిన అవగాహన, మాటలు రావడం గురించిన సమస్యలు మొదలైనవి.
- అవయవ లోపాలు గల పిల్లలు: బ్రెయిలీ పుస్తకాలు మొదలైన బోధనా సదుపాయాలను గురించిన అవగాహన, బడిలో ప్రత్యేక మరుగుదొడ్లు మరియు ర్యాంపుల (మెట్లు లేని వాలు కలిగిన తోవల) సౌకర్యం, బోధన మరియు శిక్షణ కార్యక్రమాలు మొదలైనవి.
- చులకన భావాన్ని తగ్గించడం: పట్టణ గ్రామీణ పిల్లల మధ్య విద్యా సౌకర్య సామాజిక అసమానతలను తగ్గించడం.
- భద్రత మరియు స్వీయ సంరక్షణ: పిల్లలు మాదక ద్రవ్యాలను ఎలా అలవాటు చేసుకుంటారు, చెడు అలవాట్ల నుండి తోటిపిల్లల నుండి ఎలా ఒత్తిడికి గురవుతారు అన్న విషయం గురించిన అవగాహన; ప్రవర్తనలో మార్పులు, మానసిక ఒత్తిడి, చెడు ప్రభావాలు, కుటుంబానికి పిల్లలకు సలహాలు మొదలైనవాటి గురించిన అవగాహన ఏర్పరచాలి.
- మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం: పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే రీతులు (తోటి పిల్లలనుండి ఒత్తిడి, దుష్టశక్తులు), ప్రవర్తన మార్పులు, మానసిక ఒత్తిడి, చెడు ప్రభావాలు, కుటుంబానికి పిల్లలకు సలహాల ద్వారా చికిత్స మొదలైన వాటి గురించిన అవగాహన.
- భారతదేశం లోని పిల్లల సంరక్షణ తాలూకు చట్టాల గురించిన అవగాహన: బాలనేరస్థులకు న్యాయం (పిల్లలపై శ్రద్ధ వారి సంరక్షణ చట్టం – 2000; పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా చట్టం – 2009; బాలకార్మికుల నివారణ మరియు సవరణ చట్టం 2016; బాల్యవివాహాల నిషేధం తాలూకు చట్టం – 2006)... వీటి గురించిన అవగాహన.
- బాల కార్మికులు: బాల కార్మికులకు సంబంధించిన హక్కులను మరియు సమస్యలను గురించిన అవగాహన, బాల కార్మిక నిషేధం సవరణ చట్టం - 2016, భౌతికంగా మానసికంగా పిల్లల కష్ట పరిస్థితుల నుండి ప్రయోజనం పొందడం, పిల్లలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు దేశాలకు తరలించడం, ప్రమాదకర పరిస్థితులలో పిల్లలచేత పని చేయించుకోవడం మొదలైనవి.
- సంస్కృతి, స్పృహ: భారత మరియు ప్రపంచ చరిత్రను సంపన్నం చేయడం, గిరిజనుల చరిత్ర, స్వాతంత్ర్య సమర యోధులను గురించిన జ్ఞానం, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రాచుర్యం కలిగించడం, వారసత్వానికి సంబంధించిన అద్భుతాలు, పండుగలను జరుపుకోవడం, భాషావైవిధ్యానికి ప్రాచుర్యం కలిగించడం; కులాల, సమూహాల మధ్య స్వీకారం, మైత్రి మరియు కలుపుకోవడం మొదలైనవి..
- సంగీతం: విస్తృతమైన సంగీత వారసత్వం గురించిన అవగాహన, ఇతర సంస్కృతులతో ఆదాన ప్రదానం, భాషలను స్వీకరించడాన్ని పెంపొదించడం మొదలైనవి.
- వ్యాపార దక్షత, నూతనావిష్కరణ: నవజాత వ్యాపార సంస్థలను నెలకొల్పడం గురించిన అవగాహనను చిన్నతనంలోనే కలిగించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, కొత్త సాంకేతికతకు సంబంధించిన నూతనావిష్కరణలను తెలియబరచడం మొదలైనవి.
- జాతి నిర్మాతలుగా పిల్లలు: యువకులు తమ అభిప్రాయాలను తెలుపుకునేందుకు వేదికల ఏర్పాటు, జాతీయ బాధ్యతలను గురించిన అవగాహన, స్వచ్ఛంద సేవలను గురించిన అవగాహన మొదలైనవి.
- యువకులకు సంబంధించిన కొత్త అం: అభివృద్ధిని నిలిపి ఉంచగలగడం, వాతావరణ మార్పు, మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన, లింగ సమానత్వం, శాకాహారం, జాతిని నిర్మించడం, నీరును పొదుపు చేయడం, సమగ్ర అభివృద్ధి, మాదక ద్రవ్యాల అలవాటు, సాంకేతిక నూతనావిష్కరణలు మొదలైనవి.
స్త్రీలకు హక్కులు కల్పించడం
భారతదేశంలో స్త్రీల జీవన పరిస్థితులను మెరుగు పరచడం కోసం గణనీయమైన మార్పులను, అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన విషయాలను కింద ఇవ్వడం జరిగింది.
- మాతృ సంరక్షణ: గర్భిణిగా ఉన్నప్పుడు సమయానికి వైద్యపరీక్షలు, బరువు పెరగడం, గర్భస్రావ అవకాశాలను ఎక్కువ చేసే విషయాలు, గర్భానికి ముందు మరియు తర్వాత ఆహారం, గర్భిణిగా ఉన్నప్పుడు పొగాకును వాడటం, మద్యాన్ని సేవించడం వలన కలిగే దుష్ఫలితాలు, ఆడశిశు పిండాలను చంపడం మొదలైనవాటి గురించిన అవగాహన.
- బహిష్టు సమయంలో జాగ్రత్తలు: బహిష్టుకు సంబంధించిన ఆరోగ్యం గురించిన అవగాహన, పరిశుభ్రతను పాటించడం, బహిష్టు సమయంలో పరిశుభ్రత కోసం వాడవలసిన వస్తువులు మొదలైనవి.
- కుటుంబ నియంత్రణ: కుటుంబ నియంత్రణ యొక్క ప్రాధాన్యం; అవసరం లేని గర్భాలను ఎలా తప్పించుకోవడం, కుటుంబ నియంత్రణ పద్ధతులు, కౌమారదశలో గర్భం రాకుండా నివారించడం మొదలైనవి.
- పిల్లల సంరక్షణ: వివిధ వయసులలో (ఒక సంవత్సరం లోపల, 1 నుండి 2 సంవత్సరాల వరకు, 2 నుండి 5 సంవత్సరాల వరకు, 5 నుండి 10 సంవత్సరాల వరకు... ఇలా) పోషకాహార అవసరం గురించిన అవగాహన. సమయానికి టీకాలు ఇప్పించడం, పిల్లలకు విద్య నేర్పడం యొక్క అవసరం, ప్రభుత్వ సహాయంతో నడిచే శిశుసంరక్షణ కేంద్రాలు మొదలైనవి.
- ఆహారం, ఆరోగ్యం: రక్తహీనత, పునరుత్పత్తి అవయవాల అనారోగ్యం మొదలైనవాటికి దారి తీసే పోషకాహార లోపాలను గురించిన సమాచారం, పరిశుభ్రతను పాటించేందుకు అవలంబించవలసిన మార్గాలు, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యం, శారీరక ఆరోగ్యం మొదలైనవి.
- విద్య: పుట్టినప్పటి నుండి 6 -14 సంవత్సరాల వయసులో ఉచిత నిర్బంధ విద్య గురించిన న్యాయపరమైన హక్కుల తాలూకు అవగాహన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీములు, ఉపకార వేతనాలు, బాలికలకు విద్య నేర్పి వారికి అండగా ఉండటం మొదలైనవాటి గురించిన అవగాహన.
- జీనవ అభివృద్ధి దశను నిర్మించడం: ఈ విషయంలో అవగాహనను కలిగించడం; జీతాల స్కేళ్లు, అభివృద్ధి, వృత్తిపరమైన కోర్సులు, నైపుణ్యాలు, ఉపకార వేతనాలు, పనిచేసే తల్లులకు చేయూత మొదలైన అంశాలను గురించిన అవగాహనను కల్పించడం.
- లింగవివక్ష: స్త్రీ శిశువులను చంపడం, బాల్యవివాహాలు మొదలైన సామాజిక సాంస్కృతిక సమస్యలను గురించిన అవగాహన, బడులలో సమాన హక్కులు, పనిచేసే స్థలాలలో అవకాశాలు, పక్షపాతాలు, స్త్రీలకు వివిధ దశలలో చేయూతను ఇవ్వడం మొదలైనవి.
- స్వీయరక్షణ భద్రత: స్వీయరక్షణకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలు, గృహహింస సమయంలో హక్కులు, ప్రజారవాణాలో బహిరంగ ప్రదేశాలలో స్వీయరక్షణ గురించిన జాగ్రత్తలు, లింగపరమైన వేధింపులు మొదలైనవి.
- మహిళా వ్యాపార కార్యకలాపాలు: నవజాత వ్యాపార సంస్థలను నెలకొల్పడం కోసం అందుబాటులో ఉన్న వనరులు మరియు ఆర్థిక సహాయ కార్యక్రమాలను గురించిన సమాచారం, కోర్సులు, విక్రయించుకోవడంలో సహాయం, దానికోసం ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోవడం, స్త్రీకేంద్రితమైన వ్యాపారాలను, ఉత్పత్తులను గురించిన అవగాహన మొదలైనవి.
- ఆర్థిక స్వాతంత్ర్యం: ఆర్థిక విషయాలను గురించిన విద్య (ఉదాహరణకు బ్యాంకు అకౌంటును ఎలా తెరవాలి? డబ్బును ఎలా తీసుకోవాలి? మొదలైనవి), వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వివిధ రకాల ఆర్థిక పెట్టుబడులను గురించిన జ్ఞానం, సమాన పని - సమాన వేతనం యొక్క ప్రాముఖ్యం మొదలైనవి.
- భారతదేశంలో బాలికలకు, మహిళలకు గల న్యాయపరమైన హక్కులను గురించిన అవగాహన: విద్యను పొందే హక్కు (భారత రాజ్యాంగం - 2002 కు 86 వ సవరణ, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా చట్టం – 2009, కార్మిక హక్కులు, ఫ్యాక్టరీ చట్టం – 1948, మాతృప్రయోజన చట్టం – 1961, గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం – 2005, వరకట్న సమస్య, వివాహానికి అవసరమైన కనీస వయసు, సుకన్య సమృద్ధి యోజన – 2015, బేటీ బచావో బేటీ పఢావో – 2015, ఆంగన్ వాడీ వ్యవస్థ), న్యాయపరమైన సహాయ వనరులను గురించిన అవగాహన మొదలైనవి.
- కూలీలు: స్త్రీకూలీల వ్యవస్థ (జాతీయ రాష్ట్ర యూనియన్ టెరిటరీల గ్రామీణ కూలీలు) ను వారి నైపుణ్యాలను వివరించడం.
- ఇతర రంగాలు: మహిళా అభివృద్ధి కోసం సంబంధింత రంగాలలో అవకాశాలను గురించిన అవగాహన.
read more